ఒంటరిగా వస్తావు
ఒంటరిని చేస్తావు
నిన్ను చేరని జీవి ఉండదు
నిన్ను తలచుకునే జీవి ఉండదు
సంతోషాలను మరపిస్తావు
కన్నీటిని మిగులుస్తావు
నీకై ఎదురుచూసే కన్నులకు అడియాసలను మిగిల్చి
పసిప్రాణాలను బలిగొంటావు
నీమనసెందుకింత కర్కశత్వం?
నీ ఒడిలో ఆనందంగా నిద్రించే కనులుండవా??
నీ రాక కోసం తపించే మనసులుండవా....
అనందంగా తమ జీవితంలోకి నిన్ను ఆహ్వానించే తనువులుండవా....
సృష్టిలో అన్నిటినీ ఆనందంగా ఆహ్వానిస్తాం....
స్వీకరిస్తాం....
ఒక్క నిన్ను తప్ప.....
అన్నిటినీ సంతోషంగా ఆహ్వానించే వాళ్ళె నిన్ను కూడా సంతోషంగా స్వీకరిస్తే
ఈ కపటప్రేమలు, నాటకాలూ, బాధలు, ఆవేశాలు, ఆగ్రహజ్వాలలు ఉండవేమో.....
నిన్ను ఆనందంగా ఆహ్వానించే మనసుల కోసం
నీ ప్రేమకోసం
ఎదురుచూస్తూ............

0 comments:
Post a Comment