Wednesday, August 22, 2012

రుద్రాక్ష ( RUDRAKSHA )




రుద్రాక్ష



ఆధ్యాత్మికతకి, ప్రేమపూర్వకమైన భక్తి కి రుద్రాక్ష ప్రతీక. రుద్రాక్షను భగవంతునికి ప్రతిరూపంగా భావిస్తారు.
రుద్ర + అక్ష = రుద్రాక్ష దేవదేవుడైన పరమేశ్వరుని స్వరూపం.
రుద్ర అంటే శివుడు. అక్ష అంటే అశృవులు లేదా కళ్లు అని అర్థం చెబుతారు. కాబట్టి రుద్రాక్ష అంటే- శివునినేత్రాలనుంచి ఉద్భవించినవని అర్థం. కాబట్టే వాటికిపవిత్రత, పూజనీయత చేకూరింది. రుద్రాక్ష సాక్షాత్తూ శివుని ప్రతిరూపం.  
                రుద్రాక్ష “ప్లాంటే” అను వృక్ష సామ్రాజ్యానికి చెందినది. మాగ్నోలియోప్సిడా తరగతికి చెందిన ఆక్సాలిడాలెస్ వర్గానికి చెందినది. ఎలియోకార్పస్ సీ దీని కుటుంబం. ఎలియోకార్పస్ గానిట్రస్ అనేది రుద్రాక్ష జాతికి గల నామాంతరం.
                రుద్రాక్ష హిందూ ధర్మ పరంపరలో ముఖ్యస్థానము చోటు చేసుకున్నది. తంత్ర,యోగ ధర్మ చికిత్సలయందు కీలక పాత్ర వహిస్తున్నది. అధర్వణ వేదము రుద్రాక్షను సాక్షాత్తు మణి అంటున్నది.



               రుద్రాక్షలకు నేపాల్ పుట్టినిల్లు. నేపాల్‌లోని పంచక్రోశి సమీపంలోని రుద్రాక్షారణ్యంలో మొదటిసారిగా రుద్రాక్ష జన్మించినట్లు చెప్పబడుతూ ఉంది. జలేశ్వర్ మహాదేవుని పుణ్య క్షేత్రములోను,కేరళ, కొంకణీ, ఇండొనేషియా, నేపాల్, బెంగాల్, అస్సాం, మధ్య ప్రదేశ్, ముంబై ప్రాంతాల్లో ఈ చెట్లు విస్తారంగా ఉన్నాయి. ఈ చెట్టు 60 అడుగుల ఎత్తు వరకు పెరుగుతుంది. దీని పూలు తెల్లగా ఉండి ఆకులకన్నా చిన్నవిగా ఉంటాయి. ఈ చెట్టు ఫిబ్రవరిలో పూతకు వస్తుంది.
                శరదృతువులో వీనికి జామపండ్ల వంటి చిన్నకాయలు కాస్తాయి. వాటి బెరడు గట్టిగా మందముగా ఉంటుంది. పెద్ద ఉసిరికాయంత సైజులో ఉండే రుద్రాక్ష శ్రేష్టమైనది. లోపల గింజలు రేగిపండు ఆకారములో ఉంటాయి. వీటి రుచి పుల్లగా ఉంటుంది. రుద్రాక్షలలో రంధ్రము దానంతటదే ఏర్పడితే అది ఉత్తమరకమని చెప్తారు.

రుద్రాక్షలగురించి శివుడు చెప్పినట్టుగా చెబుతున్న మాటలు

                'నా నేత్రాలనుంచి జాలువారిన ఈ బిందువులతో రుద్రాక్ష వృక్షం పుట్టింది. కాబట్టి నా అనుజ్ఞ మేరకు ఈ రుద్రాక్షలు సమస్తమైన ప్రాణకోటికి మేలు కలిగిస్తూ వారి పాపాలను పరిహరింపచేసేందుకు ఉపకరిస్తాయి”  

రుద్రాక్ష లకి ఉన్న ప్రాముఖ్యత

రుద్రాక్ష చ శివాక్షం చ సర్వాక్ష భూతనాశనమ్‌|
పావన లీల కంఠాక్ష రక్షంచ శివప్రియమ్‌||

రుద్రాక్ష ధారణం నాలుగు విధాలుగా లాభం. అంటే- జ్ఞానసిద్ధి, కార్యసిద్ధి, అన్నపూర్ణసిద్ధి, కామ్యసిద్ధు లనే నాలుగు సిద్ధులు కలుగుతాయి. రుద్రాక్ష ధారణం వల్ల మనిషి బతికినంత కాలం అన్నీ కరతలామలకం కావడమే కాక, మరణానంతరం శివుడిలో మమేకమై శివైక్యం పొందుతాడనడంలో అతిశయోక్తి ఇసుమంతకూడా లేదు.


''స్థావరత్వమనుప్రాప్య భక్తానుగ్రహకారణాత్
భక్తానాం ధారణత్పాపం దివారాత్రికృతం హరేత్
    లక్షం తు దర్శనాత్పుణ్యం కోటిస్తద్ధారణాద్భవేత్"

రుద్రాక్షమాల గురించి "జాబాలోపనిషత్"లో పేర్కొన్న వాక్యాలు.
అంటే 'భక్తులను అనుగ్రహించేందుకు రుద్రాక్షలు స్థావరాలుగా అవతరించాయి. వీటిని ధరించినటువంటి భక్తులు ఏరోజు చేసిన పాపాలు ఆ రోజే నశిస్తాయి. రుద్రాక్షలను దర్శించడం వల్ల లక్ష జన్మల పుణ్యం, ధరించడం వల్ల కోటి జన్మల పుణ్యం లభిస్తుందని అర్ధం.
                రుద్రాక్షంటే శివుడే కాదు బ్రహ్మవిష్ణువులు కూడా కొలువై ఉన్నరు. త్రిమూర్తులది విడదీయలేని బంధం . అందుకని రుద్రాక్షముఖ భాగాన్ని బ్రహ్మగానూ, క్రిందిభాగాన్ని విష్ణువుగానూ చెబుతారు. ఇక మధ్యభాగం ఈశ్వరుడు. ఒక్క రుద్రాక్షను పూజిస్తే  త్రిమూర్తుల్నీ పూజించి నట్టవుతుంది. తద్వారా భక్తి, శక్తి, ముక్తి మూడింటిని అనుగ్రహిస్తుంది.  

రుద్రాక్ష ధారణం దృష్ట్వా శివో విష్ణుఃప్రసీదతి|
దేవీ గణపతిః సూర్యః సూరాశ్యాన్యేపి పార్వతి||

                రుద్రాక్షలు ధరించిన వారు ఒక్క శివునికే కాదు, విష్ణువు, దుర్గాదేవి, గణపతి, సూర్యుడు, పార్వతి వీరం దరికీ కూడా ఇష్టుడవుతాడు. వీరందరి  కరుణా కటాక్షాలు వీరికి పుష్కళంగా లభిస్తాయన్న మాట.
                రుద్రుడు అంటే శివుడు, రాక్షసులతో ఫోరాడి, మూడు పురములను భస్మం చేసినపుడు మరణించిన వారిని చూసి విచారించినపుడు జాలువారిన కన్నీరు భూమిపై పడి చెట్లుగా మారాయి. వాటినుంచి నుంచి పుట్టినవే రుద్రాక్షలు. రుద్రాక్ష అనగా రుద్రుడి కళ్ళు, కన్నీళ్ళు అని అర్ధము. శ్రీశైల క్షేత్ర తూర్పు ద్వారమైన త్రిపురాంతక క్షేత్రంలో పరమశివుడు త్రిపురాసురులను సంహరించడంతో  త్రిపురాంతక క్షేత్రమే రుద్రాక్షల జన్మస్థలమని కూడా చెబుతారు. తంత్ర శాస్త్ర ప్రకారం రుద్రాక్షలు ఎంత చిన్నవైతే అంత శక్తివంతమైనవి.


"ధాత్రీఫలప్రమాణం యచ్చ్రేష్ఠమేతదుదాహృతం
బదరీఫలమాత్రం తు మధ్యమం ప్రోచ్యతే 
బుధై:అధమం చణమాత్రం స్యాత్ప్రక్రియైష మయోచ్యతే"

                అంటే ఉసిరిక కాయంత పరిమాణమున్నవి ఉత్తమమైనవి. రేగుపండంత పరిమాణమున్నవి మధ్యమ జాతికి చెందినవి. శనగ గింజ పరిమాణం ఉన్నవి అధమమైనవి.
                ఇవి ప్రధానంగా తెలుపు, తేనె, నలుపు రంగులతోపాటు మిశ్రమ రంగుల్లో ఇవి లభ్యమవుతాయి. సాధారణంగా తేనె రంగులోని రుద్రాక్షలు ఎక్కువగా లభిస్తాయి.
                రుద్రాక్షలలో వివిధ ముఖాలు కలిగినవి లభ్యమవుతాయి. ముఖ్యంగా 38 రకాల ముఖాలుండే రుద్రాక్షలు ఉన్నట్లు పురాణాల్లో పేర్కొనబడినప్పటికీ, పండితులు మాత్రం 21 ముఖాలు వున్న రుద్రాక్షలు మాత్రమే ఉన్నట్లు చెబుతారు. మొత్తం మీద పరిశీలిస్తే 14 ముఖాలున్న రుద్రాక్షలు మత్రమే ప్రస్తుతం లభ్యమవుతున్నాయి. ఒక్కొక్క దానికి ఒక్కొక్క ప్రత్యేక లక్షణం ఉంది. 

రుద్రాక్షల వివరాలు, ఉపయోగాలు

                రుద్రాక్షను గురించి శివ పురాణము, పద్మ పురాణము, స్కంద పురాణము, ఆదిపురాణము , ఉపనిషత్తులు, మంత్ర తంత్ర శాస్త్రాదులలో ఎక్కువగా వివరించారు. వీటిని పూజకు, శరీర ధారణ కు, ఔషధంగా సేవించడానికి ఉపయోగిస్తారు.

రుద్రాక్షలలో గల ముఖ్యమైన రకాలు వాటి ఉపయోగాలు

ఏకముఖి రుద్రాక్ష : ఇది శివుని ప్రతిరూపం. ఇవి దొరకడం చాలా కష్టం. నియమ బద్ధముగా “ ఓం హ్రీం నమ: ” అను మంత్రం జపిస్తూ దీనిని ధరించిన వ్యక్తికి ఏ విషయంలోనూ కొరత ఉండదు. వ్యక్తి వికాసం, జ్ఞాన సమృద్ధి, శాంతి, సంపద చేకూరతాయి.

ద్విముఖి  రుద్రాక్ష: అర్ధనారీశ్వరులకు సంకేతం. రెండు ముఖాలు కలిగి ఉంటుంది. సోమవారము నాడు “ ఓం నమ: “ అను మంత్రం జపిస్తూ దీనిని ధరించడం వలన మానశిక శాంటి, చిత్త శాంటి, ఏకాగ్రత కలిగి  కుండలినీ శక్తి పెరుగుతుంది.

త్రిముఖి రుద్రాక్ష : ఇది అగ్నిదేవునికి సంకేతం. మూడు ముఖాలతో ఉంటుంది. “ ఓం క్లీం నమ: “ అని జపిస్తూ సోమవారము నాడు దీనిని ధరించాలి. ఆరోగ్యానికీ, అభ్యుదయానికీ ,ఉద్యోగ ప్రాప్తికీ ఉపకరిస్తుంది. స్త్రీహత్యా పాతకము నుండి బయట పడవేస్తుంది. విద్యావ్యాప్తికి దోహదపడుతుండి. పాలలో దీనిని అరగదీసి ఆ పాలు తాగితే కంటి జబ్బులు తగ్గుతాయి.

చతుర్ముఖి రుద్రాక్ష : బ్రహ్మకు ప్రాతినిధ్యం వహిస్తుంది.నాలుగు ముఖాలు గలిగి ఉంటుంది. పాలలో వేసి త్రాగితే మానసిక రోగాలు నయమవుతాయి. విద్యార్ధులకు బాగా ఉపకరిస్తుంది.

పంచముఖి రుద్రాక్ష : అయిదు ముఖాలు కలిగి ఉంటుంది. సోమవారము నాడు “ ఓం హ్రీం నమ: “ అనే మంత్రాన్ని జపించి దీనిని ధరించాలి. ఇది “పుణ్య ప్రదాయిని”  అని పేరు పొందినది. గుండె జబ్బులున్నవారికి మంచిది. శతృవులను సులభంగా జయించవచ్చు. పాము కాటునుంచి రక్షణ కలుగుతుంది.

 షణ్ముఖి రుద్రాక్ష : ఆరు ముఖాలు కలిగి ఉంటుంది. ”ఓం హ్రీం హుం నమ:” అనే మంత్రాన్ని జపించి దీన్ని ధరించాలి. ఇది  కార్తికేయునికి ప్రతీక. రక్తపోటు, హిస్టీరియా పోతాయి.

సప్తముఖి రుద్రాక్ష : ఏడు ముఖాలు కలిగినది. . ”ఓం హుం నమ:” అనే మంత్రాన్ని జపించి దీన్ని ధరించాలి. ఇది మన్మధునికి, కామధేనువుకి ప్రతీక. అకాల మరణం సంభవించకుండా తోడ్పడుతుంది.

అష్టముఖి రుద్రాక్ష : ఎనిమిది ముఖాలు కలిగి ఉంటుంది. . ”ఓం హుం నమ:” అనే మంత్రాన్ని జపించి దీన్ని ధరించాలి. విఘ్నేశ్వరునికి ప్రతీక. కుండలినీ శక్తి పెరుగుతుంది.

నవముఖి రుద్రాక్ష : తొమ్మిది ముఖాలు కలిగినది. కపిల మునికి, భైరవునికి ప్రతీక. . ”ఓం హ్రీం హుం నమ:” అనే మంత్రాన్ని జపించి దీన్ని ధరించాలి.  దుర్గాదేవి దీనికి అధిష్టాన దేవత. దుర్గ ఆరాధకులకు మంచిది. దీనిని ఎడమ చేతికి ధరించాలి.

దశముఖి రుద్రాక్ష :  పది ముఖాలు కలిగినది. ఇది సాక్షాత్తు విష్ణు మూర్తి స్వరూపము గా చెప్పబడింది. . ”ఓం హ్రీం నమ:” అనే మంత్రాన్ని జపించి దీన్ని ధరించాలి. అశ్వమేధ యాగం చేసినంత ప్రయోజనం కలుగుతుంది. దీనిని స్త్రీలు ఎక్కువగా ధరిస్తారు.

ఏకాదశముఖి  రుద్రాక్ష: పదకొండు  ముఖాలు కలిగి ఉంటుంది. రుద్రుని 11 రూపాలకు ప్రతీక. . ”ఓం హ్రీం నమ:” అనే మంత్రాన్ని జపించి దీన్ని ధరించాలి. దుష్ట శక్తులనుంచి కాపాడుతుంది. సంతాన ప్రాప్తి కలుగుతుంది.

ద్వాదశముఖి రుద్రాక్ష : పన్నెండు ముఖములు కలిగి ఉంటుంది. ఇది సూర్య భగవానుడి ప్రతీక. “ ఓం క్రౌం, క్షాం, రౌం నమ: “ అను మంత్రాన్ని జపించి దీన్ని ధరించాలి.  12 మంది ఆద్యులకు ప్రతీక. గౌరవం పెరుగుతుంది.

త్రయోదశముఖి  రుద్రాక్ష : పదమూడు ముఖాలు గలిగి ఉంటుంది. . ”ఓం హ్రీం  నమ:” అనే మంత్రాన్ని జపించి దీన్ని ధరించాలి.  కార్తికేయునికీ ప్రతీక. దీనిని పాలలో వేసి, ఆ పాలను త్రాగితే అందం పెరుగుతుంది.

చతుర్దశముఖి రుద్రాక్ష : 14 ముఖాలు కలిగి ఉంటుంది. . ఉపనిషత్తుల ప్రకారం ఇది పరమశివుని కన్ను. . ”ఓం నమ:” అనే మంత్రాన్ని జపించి దీన్ని ధరించాలి. ఇది సర్వ వ్యాధి నివారిణి.  

పంచదశముఖి రుద్రాక్ష  : పదిహేను ముఖాలు కలిగి ఉంటుంది. పశుపతికి ప్రతీక. ఆధ్యాత్మిక సాధనకు ఉపకరిస్తుంది.

షోడశముఖి రుద్రాక్ష : 16 ముఖాలు కలది. ఇది కల్పిమాడుకుకు ప్రతీక.

సప్తదశముఖి రుద్రాక్ష : పదిహేడు ముఖాలు కలిగి ఉంటుంది. విశ్వకర్మకు ప్రతీక. దీని వలన సంపద కలుగుతుంది.

అష్టాదశముఖి : 18 ముఖాలు కలిగి ఉంటుంది. ఇది భూమికి తార్కాణం.

ఏకోన్నవింశతిముఖి : 19 ముఖాలు కలిగి ఉంటుంది.. ఇది సాక్షాత్తూ నారాయణుడికి ప్రతీక.

వింశతిముఖి : 20 ముఖాలు కలిగి ఉంటుంది. ఇది సృష్టికర్త బ్రహ్మకు సంకేతం.

ఏకవింశతిముఖి : 21 ముఖాలుగల రుద్రాక్ష. ఇది కుబేరునికి ప్రతీక. ఇది అత్యంత అరుదైన రుద్రాక్ష. 21 ముఖాల కలిగిన రుద్రాక్షలతో తయారైన మాలను ఇంద్ర మాల అంటారు. ఇంద్రమాలను ధరిస్తే ఇక వారికి దుస్సాధ్యమేదీ లేదు. జ్ఞాన సమృద్ధి, సంపద చేకూరుతాయి.


రుద్రాక్ష, rudraksha, rudrakshala valana upayogalu, rudrakshala rakaalu, రుద్రాక్ష లకి ఉన్న ప్రాముఖ్యత, రుద్రాక్షల వివరాలు, ఉపయోగాలు, రుద్రాక్షల వలన కలుగు ఔషధ ఉపయోగాలు, health treatments with rudraksha





రుద్రాక్షలను గుర్తించే పద్ధతులు

నిజమైన రుద్రాక్షను చల్లని నీటిలో వేస్తే అరగంటలో వేడెక్కుతాయి.
నిజమైన రుద్రాక్షను పాలలో వేస్తే పాలు కొన్ని రోజుల వరకు విరగవు, చెడిపోవు.
రెండు రాగి నాణెముల మధ్య రుద్రాక్షనుంచితే అది సవ్య దిశలో తిరుగుతుంది
నకిలీ రుద్రాక్షను నీటిలోగానీ, పాలలోగానీ వేసినపుడు అది తేలుతుంది.

రుద్రాక్ష ధారణా నియమాలు :

                మైల సమయం లో వీటిని ధరించరాదుపొరపాటున ధరించిన యెడల తరువాత వాటిని ఆవు పాలతో శుద్ధి చేయాలి. రుద్రాక్షను ధరించేముందు "ఓం నమశ్శివాయ" శివ పంచాక్షరి మంత్రాన్ని 108 సార్లు జపించాలి.
                సరైన రూపంలో లేని రుద్రాక్షలను, ముల్లులేని రుద్రాక్షలను, పురుగులు తిన్న, పాడైపోయిన రుద్రాక్షలను ధరించరాదు. వీటిని అన్ని జాతుల, కులాలవారు ధరించవచ్చు. వీటిని బంగారం, వెండి, రాగి తీగెలతోగానీ, సిల్కు దారముతోగూర్చిగానీ ధరించాలి. రుద్రాక్ష్లను ఎల్లప్పుడు పరిశుభ్రంగా ఉంచాలి.
                సంవత్సరానికి ఒక్కసారైనా మాలకు 'మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం' చేయడం మంచిది. వీలైనంత వరకు శివరాత్రి చేయడం మంచిది. రుద్రాక్షలు ధరించిన వారు ధూమపానం, మద్యపానం చేయరాదు. వెల్లుల్లి, మాంసాహారమును మానివేయడం మంచిది.
                వివిధ రకాలైన సమస్యలతో బాధపడేవారు, వివిధ నక్షత్రాలు, రాసులవారు పండితుల సలహా మేరకు ఆయా ముఖాల రుద్రాక్షలను ధరిస్తే సత్ఫలితాలు ఉంటాయి. ఇవి వివిధ వ్యాధులను నయం చేస్తాయని ఆయుర్వేదం చెబుతోంది. ప్రధానంగా రక్తపోటు, మధుమేహం, గుండె సంబంధ వ్యాధులు, చర్మ వ్యాధులు, మూర్చ, జలుబు, గొంతు వాపు అజీర్ణం, శ్వాసకోశ వ్యాధులు మొదలైన వ్యాధులకు రుద్రాక్ష ఉపయోగపడుతుంది.
                భారతీయ ఆధ్యాత్మిక సంపదలో భాగమైన రుద్రాక్షలు ధరిస్తే పునర్జన్మ ఉండదని భారతీయులు విశ్వసిస్తారు. ఆత్మ నిగ్రహానికీ, ఆత్మ సౌందర్యానికీ, మానసిక ప్రశాంతతకూ శక్తి వాహకాలైన వీటి ధారణ యోగ శక్తి పెంపొందించుకునేందుకూ, నిర్మలమైన, నిశ్చలమైన జీవితాన్ని సాగించేందుకూ తోడ్పడుతాయి.

రుద్రాక్షల వలన కలుగు ఔషధ ఉపయోగాలు

 ఆయుర్వేద గృహచికిత్సలు

                                   మానసిక ఆందోళన

              రుద్రాక్ష ఆందోళనను తగ్గించే సహజమైన ట్రాంక్విజైజర్గా పనిచేస్తుంది. రుద్రాక్షలను మెడలో మాలగా ధరిస్తే గుండె స్పందనల వేగం తగ్గుతుంది. రక్తపోటు కూడా నియంత్రణలో ఉండే అవకాశం ఉంటుంది. పంచముఖి రుద్రాక్షలను రెంటిని నీళ్లలో రాత్రంతా నానేసి ఉంచి ఉదయం పరగడుపున తాగితే రక్తపోటు నియంత్రణలోకి వస్తుంది.

                       తరచుగా గర్భస్రావాలు జరుగుతుండటం

              గర్భస్రావం అయ్యే తత్వం ఉండే మహిళలు గర్భధారణ సమయంలో రుద్రాక్షను (గర్భగౌరీ రుద్రాక్ష) ధరిస్తే మంచిది.

                              దగ్గు, చర్మవ్యాధులు

              దీర్ఘకాలపు దగ్గు, మొండి చర్మవ్యాధులతో బాధపడేవారు పది ముఖాలు కలిగిన రుద్రాక్షను పాలతో మెత్తని ముద్దగా నూరి తీసుకోవాలి. ఇది సెగ గడ్డలు, మొటిమలు, చుండ్రు, తామర వంటి చర్మసంబంధ సమస్యలను చక్కగా తగ్గిస్తుంది.

                              చిన్నపిల్లల్లో జ్వరం

              చిన్న పిల్లల్లో తరచుగా జ్వరం వస్తున్నప్పుడు త్రిముఖ రుద్రాక్షను ధరింపచేస్తే హితకరంగా ఉంటుంది. చికెన్పాక్స్, స్మాల్పాక్స్ వంటి వైరల్ వ్యాధులను తగ్గించుకోవడానికి రుద్రాక్షలను, మిరియాలను సమపాళ్లలో పొడిచేసి తీసుకోవాలి.

                          హిస్టీరియా, ఇతర మనోవ్యాధులు

              మనో సంబంధ సమస్యలు, నిద్రలేమి, జ్ఞాపకశక్తిలోపం వంటివి బాధిస్తున్నప్పుడు నాలుగు ముఖాలు కలిగిన రుద్రాక్షను పాలలో ఉడికించి తీసుకోవాలి.

                       చిన్న వయసులో ముసలితనం వచ్చేయటం

              రుద్రాక్షను ధరించే వారిలోనూ, రుద్రాక్షను నానేసి ఉంచిన నీళ్లను తాగే వారిలోను అకాల వార్ధక్యపు లక్షణాలు కనిపించవు.

                                 అధిక రక్తపోటు

              ఒక రాగి పాత్రలో నీళ్లు తీసుకొని 5 ముఖాల రుద్రాక్షను, 7 మిరియం గింజలు, 7 తులసి ఆకులు, ఒక లవంగం, ఒక పెద్ద ఏలక్కాయను వేసి రాత్రంతా నానబెట్టి ఉంచండి. మర్నాడు పగలు వడపోసి తాగండి. ఇలా కొంతకాలంపాటు చేస్తే అధిక రక్తపోటు తగ్గుతుంది.


                                         
                                    *************************

0 comments:

Post a Comment