Sunday, October 21, 2012

తెలుగు భాష - ఇటాలియన్ ఆఫ్ ద ఈస్ట్


తెలుగు భాష - ఇటాలియన్ ఆఫ్ ద ఈస్ట్



తెలుగు భాషకి గల గొప్పతనమును గురించి చెప్పే ప్రతి సారీ చాలా మంది  తెలుగు ని ఇటాలియన్ ఆఫ్ ద ఈస్ట్ అని తెలుగు భాషని ఎక్కడో వాడుకలో ఉన్న ఇటలీ భాషతో పోలుస్తారు.

తెలుగు అజంత భాష. అనగా దాదాపు ప్రతి పదము ఒక అచ్చుతో అంతము అవుతుంది. ఇటాలియన్ భాష కూడా అచ్చుతోనే అంతము అవుతుంది.
హిందీ మొదలయిన చాలా భారతీయ భాషలు హలంత భాషలు అనగా హల్లులతో అంతమయ్యే భాషలు. 

దీన్ని గమనించే 15వ శతాబ్దములో ఇటాలియన్ యాత్రికుడు నికొలో డా కాంటి తెలుగుని ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్  గా అభివర్ణించాడు. హెన్రీ మారిస్ మరియు చార్లెస్ ఫిలిఫ్ బ్రౌన్ లు కనుగొన్న విషయం ఇటాలియన్ భాష,తెలుగు భాష రెండింటి ఉచ్ఛారణలో ఉన్న సారుప్యాన్ని కనుగొన్నారు.

ఇటాలియన్ భాష లో ప్రతి పదం పలికేటప్పుడు చివర లో ఉచ్చరించేది “ఒక అచ్చు” ను అదే విధానం తెలుగుకూ ఉండటం తో “తెలుగు ఇటాలియన్ ఆఫ్ ద ఈస్ట్ ” అయ్యింది.ఒక ఇటాలియను పదం ఉదాహరణ గా మనకి తెలిసిన “ఫియట్” కారుని  విస్తరిస్తే ఫాబ్రికానా ఇటాలియానాఆటోమొబైలో టొరినో గా ప్రతి పదం చివర అచ్చు వచ్చి చేరుతుంది.

అచ్చుతో అంతమయ్యే విషయం వల్ల ఇది సంగీతపరంగా సంగీతకారులకు చాలా ఇష్టమైన భాష. ముఖ్యముగా కర్ణాటక సంగీతం లోని చాలా కృతులు తెలుగు భాషలోనే ఉన్నాయి. త్యాగరాజు, భద్రాచల రామదాసు, క్షేత్రయ్య, అన్నమయ్య, వంటివారు తమ తమ కృతులతో, కీర్తన లతో, తెలుగును సంగీతపరంగా సుసంపన్నం చేసినారు. 

పంతొమ్మిదవ శతాబ్దానికి చెందిన యూరోపియనులు తెలుగును “ఇటాలియన్ ఆఫ్ ద ఈస్ట్” (Italian of the east) అని పిలుచుకున్నారు.నిజానికి ఇటాలియను కంటే తెలుగు పురాతనమైనది.కనుక్ల మనము ఇటాలియను భాషను  “తెలుగు ఆఫ్ యూరోపు” అని పిలుచుకోవచ్చు.



6 comments:

డా.ఆచార్య ఫణీంద్ర said...

ఆంద్ర ప్రదేశ్ ఏర్పడక ముందు 'అజంతా-ఎల్లోరా' లు నిజాం ప్రాంతం లో ఉండేవి. 'అజంత'కు ఆ పేరెందుకు వచ్చిందో తెలుసా? ఔత్తరాహికులు దక్షిణం వైపు ప్రయాణిస్తున్నప్పుడు, ఎక్కడ 'హలంత భాష'(హిందీ) మాట్లాడడం ఆగి పోయి, అజంత భాష (తెలుగు) మాట్లాడడం మొదదలవుతుందో, ఆ ప్రదేశాన్ని 'అజంత' అని వ్యవహరించసాగారు. అలా 'అజంత'కు ఆ పేరు స్థిరపడింది. అలా ఆనాటి తెలుగు భూమి రెండు రాష్ట్రాలలో ( నిజాం, మద్రాసు ) విస్తరించి, 'అజంత' నుండి తంజావూర్ వరకు వ్యాపించి ఉండేది.
మీరందించిన మంచి పోస్టు చూసాక ఈ విషయం మీతో పంచుకోవాలనిపించింది. మీకు నా అభినందన!

Unknown said...

బ్లాగుకి విచ్చేసినందుకు,మంచి విషయాలను పంచుకున్నందుకు కృతజ్ఞతలు డా.ఆచార్య ఫణీంద్ర గారు

శ్రీ said...

తెనేకంటే తీయని తెలుగు భాష గురించిన
మంచి విషయాన్ని మాతో పంచుకున్నందుకు అభినందనలు...
@శ్రీ

Unknown said...

మీ అభినందనలకు ధన్యవాదాలు అండీ.. @శ్రీ గారు

శ్రీ said...

http://srikavitalu.blogspot.in/2012/10/blog-post_80.html...o saari choodandi...@sri

Unknown said...

@ శ్రీ గారు..
చాలా బాగుంది సర్.. తెలుగు భాష గొప్పతనము గురించి ఒక్క చిన్న కవితలో అద్భుతముగా చెప్పారు.

Post a Comment